అమెరికా అమ్ములపొదిలో అధునాతన యుద్ధ విమానం

అమెరికా అమ్ములపొదిలో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్‌ బాంబర్‌ యుద్ధ విమానం బి-2 స్పిరిట్‌. దీని స్థానంలో అత్యాధునిక బి-21 రైడర్లు త్వరలో చేరనున్నాయి.

Published : 01 Dec 2022 05:31 IST

స్టెల్త్‌ బాంబర్‌ ఖరీదు రూ.16,200 కోట్లు
రేపు ఆవిష్కరణ

వాషింగ్టన్‌: అమెరికా అమ్ములపొదిలో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ స్టెల్త్‌ బాంబర్‌ యుద్ధ విమానం బి-2 స్పిరిట్‌. దీని స్థానంలో అత్యాధునిక బి-21 రైడర్లు త్వరలో చేరనున్నాయి. ‘‘ప్రపంచంలోనే ఇప్పటివరకు నిర్మించిన అత్యాధునిక సైనిక బాంబర్‌ విమానం ఇదే’’ అని దీన్ని తయారుచేసిన నాథ్రాప్‌ గ్రమ్మన్‌ సంస్థ పేర్కొంది. ఆరో తరానికి చెందిన ఈ స్టెల్త్‌ బాంబర్‌ విమానాన్ని ఆ సంస్థ శుక్రవారం కాలిఫోర్నియాలో ఆవిష్కరించనుంది. ఒక్కో బి-21 రైడర్‌ ఖరీదు సుమారు.16,200 కోట్లు. ప్రారంభంలో మొత్తం ఆరు రైడర్లను ఈ సంస్థ తయారు చేయనుంది. 2023లోపు ఇవి అమెరికా సైన్యంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. సంప్రదాయ, అణ్వాయుధాలతో పాటు.. భవిష్యత్తులో వినియోగంలోకి రానున్న లేజర్‌ ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం ఈ బి-21 రైడర్ల ప్రత్యేకత. ప్రత్యర్థులకు చిక్కకుండా.. దొరకకుండా ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా ఇవి ఛేదించగలవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు