Rishi Sunak: ప్రధాని పీఠానికి ప్రేరణ ఆ ఉద్యోగమే: రిషి సునాక్
విద్యార్థి దశలో సౌథాంప్టన్‌లోని భారతీయ రెస్టారెంటులో షిఫ్టుల వారీగా తానుచేసిన పని, పొందిన గొప్ప శిక్షణే ప్రస్తుత ఉన్నత పీఠం దిశగా నడిపించాయని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు.
లండన్: విద్యార్థి దశలో సౌథాంప్టన్‌లోని భారతీయ రెస్టారెంటులో షిఫ్టుల వారీగా తానుచేసిన పని, పొందిన గొప్ప శిక్షణే ప్రస్తుత ఉన్నత పీఠం దిశగా నడిపించాయని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. లండన్‌లో ఏటా నిర్వహించే దక్షిణాసియా వంటకాల ‘కర్రీ ఆస్కార్స్’ అవార్డుల వేడుకలో వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ ఆతిథ్య రంగంలోని తన అనుభవాలను పంచుకొన్నారు. దేశవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించి, ఉత్తమ వంటకాలకు అవార్డులు అందజేసే ఈ కార్యక్రమం గత 18 ఏళ్లుగా లండన్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ.. ‘తీవ్రమైన ఒత్తిడిలో వంటవాళ్ల నుంచి వెయిటర్ వరకు మీరెంత కష్టపడతారో నాకు తెలుసు. ఈ అనుభవం వ్యాపారంలో నాకెంతో ఉపయోగపడింది’ అని తెలిపారు.
2022 అవార్డు విజేతలు : బెస్ట్ సెంట్రల్ లండన్ రెస్టారెంట్‌గా ‘బెనారస్’ (ఇండియన్), బెస్ట్ న్యూకమర్‌గా లండన్‌లోని ‘కల్నల్ సాబ్’, వాయవ్య ఇంగ్లాండ్‌లో బెస్ట్ రెస్టారెంట్‌గా లివర్‌పూల్‌లోని ‘మౌగ్లి స్ట్రీట్‌ఫుడ్’ నిలిచాయి. మరికొన్ని భారతీయ రెస్టారెంటులు సైతం అవార్డులు గెలుచుకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్