20 టన్నుల చెత్తలో పెళ్లి ఉంగరం!

అమెరికాలోని విండ్‌హామ్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లినాడు తన భార్యకు తొడిగించిన ఉంగరాన్ని నాప్కిన్‌లో చుట్టిపెట్టుకున్నాడు.

Published : 01 Dec 2022 05:16 IST

అమెరికాలోని విండ్‌హామ్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లినాడు తన భార్యకు తొడిగించిన ఉంగరాన్ని నాప్కిన్‌లో చుట్టిపెట్టుకున్నాడు. కానీ, అదెక్కడో పోయింది! భార్యపై ప్రేమతో ఎలాగైనా ఆ ఉంగరాన్ని మళ్లీ దక్కించుకోవాలనుకున్నాడు. తాను నివసించే ప్రాంతం నుంచి సేకరించిన 20 టన్నుల చెత్తనంతా వెతికాడు. ఇందుకు పారిశుద్ధ్య సిబ్బంది కూడా సహకరించారు. పట్టుదల ఉంటే సాధించలేనిదేముందని! ఎట్టకేలకు బుధవారం ఆ ఉంగరం దొరకడంతో అతడు ఎగిరి గంతేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు