ఉపాధి కోసం ఓడ చుక్కానిపైనే 11 రోజులు ప్రయాణం

ఆఫ్రికా దేశాల్లో వలస జీవుల దయనీయ స్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. నైజీరియా నుంచి యూరప్‌కు వెళుతున్న ఓ నౌకలో ముగ్గురు వలస జీవులు ఓడ చుక్కానిపై 11 రోజుల పాటు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా అలిథిని-2 అనే నౌక చమురు, రసాయనాలతో నైజీరియా నుంచి యూరప్‌నకు ప్రయాణిస్తోంది.

Updated : 01 Dec 2022 05:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫ్రికా దేశాల్లో వలస జీవుల దయనీయ స్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. నైజీరియా నుంచి యూరప్‌కు వెళుతున్న ఓ నౌకలో ముగ్గురు వలస జీవులు ఓడ చుక్కానిపై 11 రోజుల పాటు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా అలిథిని-2 అనే నౌక చమురు, రసాయనాలతో నైజీరియా నుంచి యూరప్‌నకు ప్రయాణిస్తోంది. 11 రోజుల ప్రయాణం తర్వాత ఈ నౌక స్పెయిన్‌లోని క్యానరీ ఐలాండ్‌ తీరానికి చేరింది. ఆ సమయంలో స్థానిక కోస్ట్‌ గార్డులు ఓడ చుక్కానిపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉండటం గమనించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నైజీరియాలోని లాగోస్‌ నుంచి ఓడ చుక్కానిపై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ముగ్గురిలో 11 ఏళ్లలోపు బాలుడు కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను సాల్వమెంటో మెరైన్‌ సంస్థ ట్విటర్‌లో షేర్‌ చేసింది. 11 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడం వల్ల ముగ్గురు డీహైడ్రేషన్‌కు గురి కావడంతో  స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011 తర్వాత ఉత్తర ఆఫ్రికా ప్రాంతం నుంచి పాశ్చాత్య దేశాలకు వలస వచ్చే వారి విషయంలో నిబంధనలు కఠినతరం చేయడంతో కొందరు ఇలా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని