రసాయన ఆయుధాలను పరీక్షించిన లాడెన్‌

అల్‌ఖైదా మాజీ అధినేత, అమెరికా బలగాల చేతుల్లో హతమైన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ గురించి అతడి నాలుగో కుమారుడు ఒమర్‌ తాజాగా కొన్ని కీలక వివరాలు బయటపెట్టారు.

Updated : 02 Dec 2022 06:32 IST

స్వయంగా వెల్లడించిన అతడి కుమారుడు ఒమర్‌

లండన్‌: అల్‌ఖైదా మాజీ అధినేత, అమెరికా బలగాల చేతుల్లో హతమైన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ గురించి అతడి నాలుగో కుమారుడు ఒమర్‌ తాజాగా కొన్ని కీలక వివరాలు బయటపెట్టారు. తన తండ్రి గతంలో రసాయన ఆయుధాలను పరీక్షించాడని వెల్లడించారు. వాటిని తన పెంపుడు శునకాలపై ప్రయోగించాడని, అది తనకు ఎంతమాత్రమూ నచ్చలేదని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లోని నార్మండీలో నివాసముంటున్న ఒమర్‌ (41) తాజాగా ఖతర్‌ పర్యటనలో ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో పలు విషయాలను పంచుకున్నారు. ‘‘నాన్న తన వారసుడిగా నన్నే భావించారు. అందుకే బాల్యంలో అఫ్గానిస్థాన్‌లో ఉన్నప్పటి నుంచే నాకు తుపాకీ కాల్పులపై శిక్షణనిచ్చారు. కానీ నేను 2001 ఏప్రిల్‌లో అఫ్గాన్‌ను వీడాను. నేను వెళ్లిపోవడం ఆయనకు నచ్చలేదు’’ అని పేర్కొన్నారు. ‘వారసుడిగా మిమ్మల్నే ఎందుకు ఊహించుకున్నారు?’ అని ఎదురైన ప్రశ్నకు ఒమర్‌ స్పందిస్తూ.. బహుశా మిగతా కుమారులతో పోలిస్తే తనకే ఎక్కువ తెలివితేటలు ఉన్నట్లు తండ్రి భావించి ఉండొచ్చన్నారు. తాను తెలివిగలవాడిని కాబట్టే ప్రస్తుతం జీవించి ఉన్నానని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని