మాకూ ముడిచమురు చౌకగా ఇవ్వండి

భారత్‌, ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు.. తమకు కూడా ముడిచమురు తక్కువ ధరకు అందించాలని పాకిస్థాన్‌ చేసిన విజ్ఞప్తిని రష్యా తిరస్కరించింది.

Updated : 02 Dec 2022 06:29 IST

పాక్‌ విజ్ఞప్తి.. తిరస్కరించిన రష్యా

ఇస్లామాబాద్‌: భారత్‌, ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు.. తమకు కూడా ముడిచమురు తక్కువ ధరకు అందించాలని పాకిస్థాన్‌ చేసిన విజ్ఞప్తిని రష్యా తిరస్కరించింది. ముడి చమురు ధరల్లో 30 నుంచి 40 శాతం రాయితీని మాస్కోలో పర్యటిస్తున్న పాక్‌ బృందం కోరినట్లు సమాచారం. దీనిపై రష్యా సానుకూలంగా స్పందించలేదని ఓ పత్రిక పేర్కొంది. ఇప్పటికే తాము పెద్ద దేశాలకు రాయితీపై ముడి చమురు అందిస్తున్నామని, వాటి ఆర్థిక వ్యవస్థలు బలమైనవి, విశ్వసనీయమైనవని రష్యా అధికారులు పాక్‌ బృందానికి తెలిపినట్లు ఆ పత్రిక వెల్లడించింది. అయితే పాకిస్థాన్‌ డిమాండ్‌ను పరిశీలిస్తామని, ఏ విషయమూ దౌత్యమార్గాల్లో తర్వాత వెల్లడిస్తామని రష్యా అధికారులు పేర్కొన్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని