చమురు ధరపై పరిమితికి ఒప్పుకోం : రష్యా
రష్యా చమురు ధరపై పరిమితి విధించాలన్న పశ్చిమ దేశాల నిర్ణయం కొత్త వివాదాన్ని రాజేసింది. దీనిపై పుతిన్ సర్కారు మండిపడింది.
కీవ్: రష్యా చమురు ధరపై పరిమితి విధించాలన్న పశ్చిమ దేశాల నిర్ణయం కొత్త వివాదాన్ని రాజేసింది. దీనిపై పుతిన్ సర్కారు మండిపడింది. ధర తగ్గింపును సమర్థించిన దేశాలకు సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించింది. రష్యాకు తాము చెల్లించే చమురు ధరను పీపాకు 60 డాలర్లకు పరిమితం చేసుకోవాలని అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తోపాటు ఐరోపా సంఘంలోని 27 దేశాలు శుక్రవారం నిర్ణయించాయి. సోమవారం నుంచి ఇది అమలుకానుంది. దీనిపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. పరిస్థితిని విశ్లేషించాకే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. అయితే ధరపై పరిమితిని ఆమోదించబోమని స్పష్టంచేశారు. ఇలాంటి నిర్ణయాన్ని సమర్థించే ఐరోపా దేశాలు.. ఆ తర్వాత విచారించాల్సి ఉంటుందని వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ స్పష్టంచేశారు. రష్యా చమురుకు ఐరోపా దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు రష్యా ఇంధన ధరను మరింత తగ్గించాలని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం.. ఐరోపా దేశాలకు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?