మత స్వేచ్ఛ ఉల్లంఘన దేశాల్లో రష్యా, చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌

మత స్వేచ్ఛను ఆందోళనకర స్థాయిలో అతిక్రమిస్తున్న దేశాల జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విడుదల చేశారు.

Published : 04 Dec 2022 05:06 IST

జాబితాను విడుదల చేసిన అమెరికా

వాషింగ్టన్‌: మత స్వేచ్ఛను ఆందోళనకర స్థాయిలో అతిక్రమిస్తున్న దేశాల జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ విడుదల చేశారు. మొత్తం 12 దేశాలతో కూడిన ఆ జాబితాలో చైనా, రష్యా, పాకిస్థాన్‌, మియన్మార్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌, ఉత్తర కొరియా, క్యూబా, నికరాగువా, తుర్క్‌మెనిస్థాన్‌, తజికిస్థాన్‌, ఎరిత్రియా దేశాలున్నాయి. 1998 నాటి అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం నిబంధనలను ఈ దేశాలు ఆందోళనకరస్థాయిలో ఉల్లంఘిస్తున్నాయని బ్లింకెన్‌ చెప్పారు. అల్జీరియా, వియత్నాం, కొమొరోస్‌, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లపై ఈ విషయంలో కన్నేసి ఉంచామన్నారు. ఇంకా తాలిబన్‌, బోకో హరాం, హౌతీలు, ఐసిస్‌ గ్రేటర్‌ సహారా, పశ్చిమ ఆఫ్రికా శాఖలు, రష్యన్‌ కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూపుతో పాటు మరికొన్ని తీవ్రవాద సంస్థలను కూడా ఆందోళనకరమైన సంస్థల జాబితాలో చేర్చారు. కాగా భారత్‌ను కూడా మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్న దేశాల జాబితాలో చేర్చాలని ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ వంటి గ్రూపులు అమెరికాలో పైరవీలు చేశాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని