కెనడా వీసాలు ఇక సులభం

ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ (ఒ.డబ్ల్యూ.పి.)పై కెనడాకు వచ్చి పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కల్పించే నిర్ణయాన్ని కెనడా తీసుకుంది.

Published : 04 Dec 2022 05:06 IST

ఓడబ్ల్యూపీ పర్మిట్‌దారుల కుటుంబికులకూ అనుమతి

టొరంటో: ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ (ఒ.డబ్ల్యూ.పి.)పై కెనడాకు వచ్చి పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కల్పించే నిర్ణయాన్ని కెనడా తీసుకుంది. ఇకపై వీరు కెనడాలో ఏ యజమాని వద్దనైనా ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు. ప్రధాన దరఖాస్తుదారుని కుటుంబికులు 2023 జనవరి నుంచి కెనడాలో పనిచేయడానికి అర్హులేనని పౌరసత్వ శాఖ మంత్రి సియాన్‌ ఫ్రేజర్‌ ప్రకటించారు. వేర్వేరు స్థాయిల్లో దాదాపు రెండు లక్షల మంది కార్మికులను తీసుకోవడం ద్వారా కొరతను అధిగమించగలుగుతామని చెప్పారు. గతంలో అత్యంత నైపుణ్య వృత్తుల్లో పనిచేసేవారి జీవిత భాగస్వాములకే వర్క్‌ పర్మిట్లను పొందడానికి వీలయ్యేది. కొత్త నిర్ణయం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, భావోద్వేగాల పరంగా కార్మికులు లబ్ధి పొందుతారని కెనడా భావిస్తోంది. ఈ నిర్ణయం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని