బజ్వా మాతో డబుల్‌ గేమ్‌ ఆడారు

పాకిస్థాన్‌ మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ (రిటైర్డ్‌) కమర్‌ జావేద్‌ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి విమర్శలు గుప్పించారు.

Published : 05 Dec 2022 04:27 IST

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ (రిటైర్డ్‌) కమర్‌ జావేద్‌ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. సైన్యాధిపతిగా ఉన్నప్పుడు బజ్వా తన ప్రభుత్వంతో డబుల్‌ గేమ్‌ ఆడారని ఆరోపించారు. ఆయన పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగించాలని (2019లో) నిర్ణయించడం తాను చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు బజ్వా ఏం చెప్పినా నమ్మేవాడినని తెలిపారు. స్థానికంగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో శనివారం ఈ మేరకు పలు అంశాలపై ఇమ్రాన్‌ మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని