మెట్లపై జారిపడ్డ పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలోని తన అధికారిక నివాసంలో గతవారం మెట్ల మీద నుంచి జారిపడినట్లు తెలుస్తోంది.

Published : 05 Dec 2022 06:39 IST

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వార్తలు

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలోని తన అధికారిక నివాసంలో గతవారం మెట్ల మీద నుంచి జారిపడినట్లు తెలుస్తోంది. ఆయన ఐదు మెట్ల వరకు జారారని, ఆ అనూహ్య ఘటన సమయంలో అనియంత్రిత మలవిసర్జన జరిగిందని ఓ వార్తాసంస్థలో కథనం వెలువడింది. పుతిన్‌ ఉదర, పేగు క్యాన్సర్‌తో బాధపడుతుండటమే అనియంత్రిత మలవిసర్జనకు కారణమని అందులో పేర్కొన్నారు. ఈ పరిణామంతో- రష్యా అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యంగా ఉన్నారంటూ మళ్లీ వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన చేతులు తరచూ వణుకుతున్నాయని, సరిగా నడవలేకపోతున్నారని, రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఇటీవల వార్తలొచ్చిన సంగతి గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని