ఇదేం ఏటీఎంరా బాబోయ్‌.. గుట్టంతా విప్పేస్తోంది

సాధారణంగా ఏటీఎంకి వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. వేరేవారు తమ ఖాతా వివరాలు తెలుసుకొని డబ్బులు దోచుకుంటారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్‌ ముగిసిన తర్వాత కొంతమంది నంబరు బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకు వస్తారు.

Published : 05 Dec 2022 04:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఏటీఎంకి వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. వేరేవారు తమ ఖాతా వివరాలు తెలుసుకొని డబ్బులు దోచుకుంటారేమోనన్న అనుమానంతో ట్రాన్సాక్షన్‌ ముగిసిన తర్వాత కొంతమంది నంబరు బోర్డుపై ఏవేవో అంకెలు నొక్కేసి బయటకు వస్తారు. బ్యాంకులో ఉన్న నిల్వ మొత్తం, ఇతర వివరాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతారు. అమెరికాలోని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఏటీఎం మాత్రం బ్యాంకు ఖాతాదారుల గుట్టంతా విప్పేస్తోంది. ఒకసారి దానిలో కార్డు పెట్టి ఎదురుగా నిలుచుంటే చాలు.. కస్టమర్‌ ఫొటో తీసి ఖాతాలో ఎంత మొత్తం ఉందో ఏటీఎంపైన ఏర్పాటు చేసిన లీడర్‌ బోర్డుపై అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తోంది. నిల్వ మొత్తం పక్కనే ఖాతాదారుడి ఫొటో కూడా ఉంటుంది. ఖాతాలో ఎక్కువ మొత్తం నిల్వ ఉన్న ఖాతాదారుడి పేరు మొదటి స్థానంలో ఉండి.. అవరోహణ క్రమంలో సున్నా బ్యాలెన్స్‌ ఉన్న కస్టమర్ల పేర్లనూ చూపిస్తోంది. ఈ ఏటీఎంను న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్‌ సంస్థతో కలిసి పెర్రోటిన్‌గ్యాలరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ప్రయోగాత్మకంగా దీనిని మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్‌ గ్యాలరీలో ఉంచారు. సాధారణ ఏటీఎంలో లాగానే ఇందులోనూ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చట. వైవిధ్యంగా ఉండటంతో చాలా మంది ప్రజలు దీనిని ఉపయోగించేందుకు ఎగబడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు