ఇండోనేసియాలో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వత విస్ఫోటం

ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటం చెందడంతో దట్టమైన బూడిద మేఘాలు ఆవరించాయి.

Published : 05 Dec 2022 04:56 IST

జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటం చెందడంతో దట్టమైన బూడిద మేఘాలు ఆవరించాయి. భారీగా లావా విడుదలైంది. ‘రుతుపవన వర్షాల ధాటికి 3,676 మీటర్ల ఎత్తులోని మౌంట్‌ సెమెరుపై లావా గోపురం సైతం కూలిపోయింది. అనేక గ్రామాలను బూడిద కప్పేసి ఎండను నిరోధించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వందల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బూడిద పొరలు 1500 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిశాయి. సెమెరు అగ్నిపర్వతం వాలుల నుంచి లావా సమీపంలోని నదివైపు ప్రవహించింది’ అని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్‌ ముహారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని