చైనాలో కొవిడ్‌తో మరో ఇద్దరి మృతి

చైనాలోని కొన్ని నగరాల్లో కొవిడ్‌ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఆదివారం మరో రెండు మరణాలు నమోదయ్యాయి.

Updated : 05 Dec 2022 05:52 IST

హాంకాంగ్‌: చైనాలోని కొన్ని నగరాల్లో కొవిడ్‌ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో ఆదివారం మరో రెండు మరణాలు నమోదయ్యాయి. షాన్‌డాంగ్‌, సిచువాన్‌ ప్రావిన్సుల్లో ఇద్దరు మృతి చెందినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. అయితే మృతుల వయసు, టీకాలు వేయించుకున్నారా? వంటి వివరాలేమీ వెల్లడించలేదు. జాతీయ ఆరోగ్య కమిషన్‌ గణాంకాల ప్రకారం చైనాలో 90% ప్రజలకు టీకాలు వేశారు. అయినా అక్కడి ప్రజల్లో తక్కువమందిలో మాత్రమే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తే లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ఆదివారం కొత్తగా 35,775 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,165కి చేరగా ఇంతవరకు మహమ్మారి బారినపడి 5,235 మంది మృతి చెందారు. చైనాకు వచ్చే ప్రయాణికులకు ఇప్పటికీ క్వారంటైన్‌ నిబంధనను అమలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని