శత్రువుతో యుద్ధానికి సిద్ధమే

పాకిస్థాన్‌ కొత్త సైన్యాధిపతి జనరల్‌ అసీం మునీర్‌.. భారత్‌ను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే తిప్పికొడతామన్నారు.

Updated : 05 Dec 2022 06:05 IST

పాక్‌ ఆర్మీ చీఫ్‌ స్పష్టీకరణ

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కొత్త సైన్యాధిపతి జనరల్‌ అసీం మునీర్‌.. భారత్‌ను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే తిప్పికొడతామన్నారు. సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖ వెంబడి రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో పర్యటించారు. అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ‘‘గిల్గిత్‌-బాల్టిస్థాన్‌తోపాటు జమ్మూ-కశ్మీర్‌పై భారత్‌ ఇటీవల బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయడాన్ని చూశాం. మా మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడమే కాకుండా.. శత్రువుపై ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేస్తున్నా’’ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన సైనికాధికారులతో చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు