జోరు కొనసాగిస్తున్న నేపాలీ కాంగ్రెస్‌

నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) పార్టీ నేతృత్వంలోని కూటమి హవా కొనసాగుతోంది.

Published : 05 Dec 2022 04:56 IST

కూటమి ఖాతాలో 85కు పెరిగిన సీట్ల సంఖ్య

కాఠ్‌మాండూ: నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సీ) పార్టీ నేతృత్వంలోని కూటమి హవా కొనసాగుతోంది. మొత్తం 165 నియోజకవర్గాలకుగాను ఇప్పటివరకు 163 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 85 సీట్లు ఎన్‌సీ కూటమి వశమయ్యాయి. వాటిలో ఎన్‌సీ వాటా 57. తాజాగా సయాంగ్జా-2 స్థానంలో ఆ పార్టీ అభ్యర్థే గెలుపొందారు. మరోవైపు ప్రతిపక్ష సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ నాయకత్వంలోని కూటమి ఇప్పటిదాకా 57 స్థానాల్లో విజయం సాధించింది. అందులో సీపీఎన్‌-యూఎంఎల్‌ వాటా 44. నేపాల్‌ ప్రతినిధుల సభలో మొత్తం 275 మంది ప్రతినిధులు ఉంటారు. వారిలో 165 మందిని మాత్రమే ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో ఎన్నుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని