ఆక్స్‌ఫర్డ్‌ ఈ ఏటి మేటి పదం.. ‘గాబ్లిన్‌ మోడ్‌’

‘గాబ్లిన్‌ మోడ్‌’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ నిఘంటువును ప్రచురించే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) సోమవారం ప్రకటించింది.

Published : 06 Dec 2022 05:26 IST

లండన్‌: ‘గాబ్లిన్‌ మోడ్‌’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌ నిఘంటువును ప్రచురించే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ (ఓయూపీ) సోమవారం ప్రకటించింది. గాబ్లిన్‌ మోడ్‌ అనే పదం వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. ఎంతసేపటికీ తన సుఖాలు, తన కోరికలే తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమది. బద్ధకం, అపరిశుభ్రత, దురాశ జీర్ణించిన ధోరణిని గాబ్లిన్‌ మోడ్‌ అంటారు. ప్రపంచమంతటా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 92 శాతం (3,18,956) ఓట్లు ఈ పదానికే వచ్చాయి. ప్రస్తుతం జనం నోళ్లలో ఎక్కువగా నానుతున్న కొత్త యాస పదాల్లో మూడింటిని ఎంచుకుని ఈ ఏటి మేటి పదమేదో నిర్ణయించడానికి ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. గాబ్లిన్‌ మోడ్‌తో మెటావర్స్‌, ‘చిఐస్టాండ్‌ విత్‌’ పదాలు పోటీపడినా చివరకు గాబ్లిన్‌ మోడ్‌కే అత్యధిక ఓట్లు లభించాయి. సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్‌లో ఈ మూడు పదాలను ఈ ఏడాది జనం విస్తృతంగా ఉపయోగించారు. ఫేస్‌బుక్‌ మెటావర్స్‌గా రూపాంతరం చెందడం, వందలు వేల మైళ్ల దూరంలో జరుగుతున్న ఉద్యమాలకు ‘చిఐస్టాండ్‌ విత్‌’ అంటూ నెట్‌ ద్వారా సంఘీభావం ప్రకటించడం వల్ల ఆ రెండు పదాలకు సర్వేలో చోటు కల్పించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు