ఇమ్రాన్‌కు పాక్‌ ఎన్నికల సంఘం షాక్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు మరో ఎదురుదెబ్బ! అధికారంలో ఉండగా అందిన విదేశీ కానుకల దుర్వినియోగం కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంది.

Published : 07 Dec 2022 05:30 IST

పార్టీ అధ్యక్ష పదవికి అనర్హుడంటూ నోటీసు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు మరో ఎదురుదెబ్బ! అధికారంలో ఉండగా అందిన విదేశీ కానుకల దుర్వినియోగం కేసు ఆయన్ను వెంటాడుతూనే ఉంది. గత ఏప్రిల్‌లో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవీచ్యుతుడైన ఇమ్రాన్‌కు.. తాజాగా సొంత పార్టీ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ అధ్యక్ష పదవికీ ముప్పు ఏర్పడింది. ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు ఇమ్రాన్‌కు నోటీసు జారీ చేసింది. కానుకల భాండాగారం (తోషాఖానా) కేసులో అభియోగాలు రుజువు కావడంతో చట్ట ప్రకారం ఆయన రాజకీయ పార్టీకి నేతృత్వం వహించేందుకు అనర్హుడని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇమ్రాన్‌కు తాఖీదులు పంపిన ఈసీ.. డిసెంబర్‌ 13న దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించినట్లు స్థానిక పత్రిక ‘డాన్‌’ పేర్కొంది. గతంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సైతం ఇదే తరహాలో పీఎంఎల్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. మరోపక్క.. తన ఫోన్‌ సంభాషణల ఆడియో లీక్‌ వ్యవహారంపై ఇమ్రాన్‌ఖాన్‌ సోమవారం లాహోర్‌ హైకోర్టును ఆశ్రయించారు. రష్యా, చైనా, అఫ్గానిస్థాన్‌లతో తన స్వేచ్ఛాయుత విదేశాంగ విధానాలు నచ్చని అమెరికా.. ఈ కుట్రకు పాల్పడిందని ఇమ్రాన్‌ ఆరోపిస్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు