టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ 2022 సంవత్సరానికి గాను టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యారు.

Published : 08 Dec 2022 04:30 IST

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ 2022 సంవత్సరానికి గాను టైమ్స్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన చిత్రాన్ని టైమ్స్‌  తన మేగజీన్‌ ముఖచిత్రంగా ప్రచురించింది. ‘‘ఉక్రెయిన్‌లో, విదేశాల్లో చాలా మంది జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. గత ఏడాదిగా ధిక్కారం, ప్రజాస్వామ్యానికి ఓ చిహ్నంగా తనను తాను నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు లేకుండా రష్యా చేస్తున్న దాడులకు ఎదురొడ్డి మరీ దేశాన్ని నడిపిస్తున్నారు’’ అని 44 ఏళ్ల జెలెన్‌స్కీని కొనియాడుతూ ‘టైమ్స్‌’ ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని