మేం చేస్తున్న సెక్స్ దైవిక విధి
‘దేవుడి స్ఫూర్తిని వారికి మేము అందిస్తున్నాం. నేను, మా అనుచరులు ఆ అమ్మాయిలతో చేస్తున్న సెక్స్ దైవిక విధులను పూర్తి చేయడమే’ అని బాలికల అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితుడు శామ్యూల్ బేట్‌మాన్ (46) అమెరికా ఫెడరల్ పోలీసులకు విచారణలో వెల్లడించాడు.
బాలికల అక్రమ రవాణా నిందితుడి వెల్లడి
కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎఫ్‌బీఐ
ఫ్లాగ్‌స్టాఫ్ (అరిజోనా): ‘దేవుడి స్ఫూర్తిని వారికి మేము అందిస్తున్నాం. నేను, మా అనుచరులు ఆ అమ్మాయిలతో చేస్తున్న సెక్స్ దైవిక విధులను పూర్తి చేయడమే’ అని బాలికల అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నిందితుడు శామ్యూల్ బేట్‌మాన్ (46) అమెరికా ఫెడరల్ పోలీసులకు విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు ఎఫ్‌బీఐ అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అరిజోనా రాష్ట్రంలోని కొలరాడో సిటీ పట్టణంలో నివసించే శామ్యూల్‌ను గత ఆగస్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఓ ట్రక్కులో ఫ్లాగ్‌స్టాఫ్ పట్టణం మీదుగా యువతులను అక్రమ రవాణా చేస్తూ ఇతను పట్టుబడ్డాడు. విచారణలో పలు భిన్నమైన విషయాలు వెల్లడవుతున్నాయి. అరిజోనా - యూటా రాష్ట్రాల సరిహద్దులో ఉండే శామ్యూల్‌కు 20 మంది భార్యలు ఉండగా, ఇందులో అత్యధికులు మైనర్లు. ఇతడు ‘ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ల్యాటర్ - డే సెయింట్స్’ (ఎఫ్ఎల్డీఎస్) మాజీ సభ్యుడు. 130 ఏళ్ల కిందటి దాకా ఈ చర్చి బోధనల్లో బహుభార్యత్వం ఓ వారసత్వం. 1890లో దీన్ని రద్దు చేశారు. తనను తాను ఓ ప్రవక్తగా చెప్పుకొనే శామ్యూల్ పలువురు అనుచరులను ఏర్పాటు చేసుకొని, ఓ సమూహానికి నాయకుడిగా చలామణి అవుతున్నాడు. అనుచరుల భార్యలు, పిల్లలు ఇతడికి భార్యలుగా మారినట్లు ఎఫ్‌బీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. శామ్యూల్ అధీనంలో ఉన్న బాలికల్లో ఒక్కరు కూడా ఫోరెన్సిక్ ఇంటర్వ్యూల్లో అతనికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం గమనార్హం. అతడికి భార్యలుగా ఉన్న ఇతర మహిళలు ఈ బాలికలను ప్రభావితం చేసి ఉంటారని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ