స్పెయిన్‌లో ప్రయాణికుల రైళ్లు ఢీ

స్పెయిన్‌లోని బార్సిలోనాకు ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు రైళ్లు బుధవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 155 మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Published : 08 Dec 2022 05:32 IST

155 మందికి గాయాలు

బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనాకు ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు రైళ్లు బుధవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 155 మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. బార్సిలోనా నగరానికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న మోంట్‌కాడా పట్టణంలో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు, వైద్య సిబ్బంది ఘటనా స్థలంలోనే 155 మందికీ ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స అవసరమైన 39 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ప్రయాణికులకు గీరుకుపోవడం, కమిలిపోవడం వంటి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటలకు ఓ రైలుకు బ్రేకులు విఫలమవడంతో పట్టాలపై నిలిపి ఉంచిన మరో రైలును ఢీ కొట్టినట్లు అధికారులు చెప్పారు. ఆ సమయంలో రెండు రైళ్లలో కలిపి 800 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని