తిరిగి కోరలు చాస్తున్న మలేరియా

కరోనా వైరస్‌ విజృంభణ మలేరియా వ్యాధి నియంత్రణకు అడ్డుతగిలింది.

Updated : 09 Dec 2022 06:00 IST

గతేడాది ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల కేసులు

జెనీవా: కరోనా వైరస్‌ విజృంభణ మలేరియా వ్యాధి నియంత్రణకు అడ్డుతగిలింది. ఫలితంగా గత రెండేళ్లలో అదనంగా 63,000 మరణాలు సంభవించాయని, అదనంగా 1.3 కోట్ల మందికి మలేరియా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గురువారం తెలిపింది. 2020లో బాగా పెరిగిన మలేరియా కేసులు 2021లోనూ వృద్ధి చెందాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల మలేరియా కేసులు నమోదై, 6,19,000 మరణాలు సంభవించాయి. వాటిలో 95 శాతం ఒక్క ఆఫ్రికా ఖండంలోనే నమోదయ్యాయి. నిజానికి 2019కన్నా ముందే మలేరియాపై పోరాటం మందగించిందని బ్రిటిష్‌ నిపుణుడు క్రెయిగ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని