కృష్ణ వావిలాలకు యూఎస్ ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం
భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలను అమెరికాలోనే అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (పీఎల్‌ఏ) వరించింది.
హ్యూస్టన్: భారతీయ అమెరికన్ కృష్ణ వావిలాలను అమెరికాలోనే అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం (పీఎల్‌ఏ) వరించింది. హ్యూస్టన్‌కు చెందిన ఆయన ప్రవాస భారతీయ సమాజానికి, అమెరికాకు పెద్దఎత్తున చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. అమెరికా ప్రభుత్వానికి చెందిన అమెరికా కోర్ నేతృత్వంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారిలో అత్యుత్తమ అంకితభావం ప్రదర్శించిన వారిని ఏటా పీఎల్‌ఏ పురస్కారం వరిస్తుంది. ఈ సంస్థ కింద 50 లక్షల మంది అమెరికా పౌరులు వివిధ కార్యక్రమాల క్రింద అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు గతవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అమెరికా కోర్ సర్టిఫయర్ డాక్టర్ సోనియా ఆర్ వైట్ వావిలాలకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇందులో శ్వేతసౌధం నుంచి అధ్యక్షుడు బైడెన్ సంతకం చేసిన ధ్రువీకరణపత్రం, మెడల్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ వావిలాల సతీమణి ప్రభాత్ లక్ష్మీ, కుమార్తెలు, మోనికా, అమండ, నలుగురు మనవలు హాజరయ్యారు. ‘‘అనూహ్యంగా లభించిన ఈ గౌరవం నన్ను కదిలిచింది. హ్యూస్టన్‌లోని భారతీయులకు అందించిన సేవలకు ఇది నిజమైన గుర్తింపు’’ అని పురస్కార ప్రదానోత్సవంలో కృష్ణ పేర్కొన్నారు. 2006లో హ్యూస్టన్ వర్సిటీలో ఇండియా స్టడీస్ పోగ్రామ్‌ను వావిలాల స్థాపించారు. ఈ ఏడాది ప్రారంభంలో టెక్సాస్‌లోని సదరన్ యూనివర్సిటీలోనూ ఇండియా స్టడీస్ ప్రోగ్రామ్ ప్రారంభించడంలో ఆయనదే ముఖ్య పాత్ర.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
-
Politics News
Amaravati: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్.. ఓటేసిన సీఎం జగన్
-
Sports News
IPL: ఇకపై టాస్ గెలిచాకే.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు చేసిన బీసీసీఐ
-
Movies News
Kalyan Ram: ఆయనతో నన్ను పోల్చవద్దు.. అంత పెద్దవాణ్ని కాదు: కళ్యాణ్‌రామ్
-
Crime News
Hyderabad: దేశవ్యాప్తంగా వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
-
Movies News
Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం