Michael Schumacher: AI ద్వారా షూమేకర్ ఇంటర్వ్యూ.. మ్యాగజీన్ ఎడిటర్‌పై వేటు!
ఏఐ (AI) ద్వారా ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినట్లు ఓ మ్యాగజీన్ కథనం ప్రచురించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ ఇంటర్వ్యూ నకిలీదని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించడంతో మ్యాగజీన్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
బెర్లిన్: కృత్రిమ మేధ (AI) కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు అత్యాధునిక సాంకేతికత, మనిషి సృజనాత్మకత కలిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జర్మనీకి చెందిన డై అక్టెల్లె (Die Aktuelle) అనే మ్యాగజీన్ ఏఐ సాయంతో చేసిన ఓ ఇంటర్వ్యూ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాగజీన్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఏఐ ద్వారా ఇంటర్వ్యూ చేసి, దాన్ని ఫార్ములా వన్ రేసింగ్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్ (Michael Schumacher)తో ప్రత్యక్షంగా చేసిన ఇంటర్వ్యూ అని చెప్పి ప్రచురించారు. అయితే, అది ఏఐ ఇంటర్వ్యూ అని తేలడంతో సదరు మ్యాగజీన్ ఎడిటర్‌ను యాజమాన్యం తొలగించింది.
ఈ ఇంటర్వ్యూపై మ్యాగజీన్ యాజమాన్యం స్పందించింది. ‘‘ ఇలాంటి తప్పుడు కథనం ఇకపై ఎప్పటికీ కనిపించదు. మా సంస్థ నుంచి పాఠకులు ఆశించే పత్రికా ప్రమాణాలకు ఇది పూర్తిగా విరుద్ధం. ఈ కథనం ప్రచురితం కావడానికి బాధ్యులైన ఎడిటర్‌ను విధుల నుంచి తొలగించాం’’ అని మ్యాగజీన్ మాతృ సంస్థ ఫంకే (Funke) ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 15న డై అక్టెల్లె మ్యాగజీన్ మైఖేల్ షూమేకర్ నవ్వుతున్న ఫొటోతోపాటు ‘‘ మైఖేల్ షూమేకర్ తొలి ఇంటర్వ్యూ’’ అనే హెడ్‌లైన్‌ను, ‘‘ఇది మోసపూరిత నిజం’’ అనే సబ్‌హెడ్‌లైన్‌ను కవర్ పేజీపై ప్రచురించింది. లోపలి పేజీల్లో ‘‘నా జీవితం పూర్తిగా మారిపోయింది’’ అని షూమేకర్ చెబుతున్నట్లు ప్రశ్న-జవాబులతో ఇంటర్వ్యూను ప్రచురించింది. అందులో, ప్రమాదం తర్వాత తన జీవితం ఎలా ఉందనేది షూమేకర్ చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ ఇంటర్వ్యూ పూర్తిగా నకిలీదని షూమేకర్ కుటుంబసభ్యులు ప్రకటించారు. మ్యాగజీన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2013లో ఫ్రెంచ్ ఆల్ఫ్ పర్వతాల్లో స్కైయింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో మైఖేల్ షూమేకర్ తలకు తీవ్రంగా గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన్ను స్విట్జర్లాండ్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 2021లో నెట్‌ఫ్లిక్స్ షూమేకర్‌పై నిర్మించిన డాక్యుమెంటరీలో ఆయన భార్య మాట్లాడారు. ‘‘ఇంట్లో మేమంతా కలిసే ఉంటున్నాం. ఆయనకు కావాల్సిన చికిత్స అందిస్తున్నాం. ఆయన తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు కావాల్సిన సాయం అందిస్తాం.’’ అని చెప్పారు. 2012లో షూమేకర్ ఫార్ములా వన్ రేసింగ్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఏడు సార్లు ఫార్ములా వన్ రేస్‌ను గెలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం