Corona: జర్మనీపై కరోనా పడగ.. ఒక్కరోజే 96వేలకు పైగా కేసులు!

ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా(Corona virus) మహమ్మారి యూరప్‌ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది......

Published : 01 Oct 2022 00:17 IST

బెర్లిన్‌: ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా(Corona virus) మహమ్మారి యూరప్‌ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తుండటంతో ఏం చేయాలో తోచక సతమతమవుతోన్న జర్మనీపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 24గంటల్లోనే ఆ దేశంలో 96వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తుండటంతో సతమతమవుతున్న వేళ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్‌ లాటర్‌బాచ్‌ హెచ్చరించారు. కొత్త వేరియంట్ల నుంచి కాపాడుకొనేందుకు వృద్ధులు రెండో బూస్టర్‌ డోసు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

యూరప్‌లోని ఇతర దేశాలైన ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌లలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ మేరకు బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన శీతాకాలం ఆరంభంలో ఉన్నామని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జర్మనీలో గడిచిన 24గంటల వ్యవధిలోనే 96,367 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది వారం క్రితం నమోదైన కొవిడ్‌ కేసులతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. శనివారం నుంచి జర్మనీలో 16 రాష్ట్రాలు మళ్లీ ఇంట్లోనూ మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనల్ని విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని