Gotabaya Rajapaksa: బ్యాంకాక్ హోటల్లో గొటబాయ..
దేశం విడిచి వెళ్లిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బ్యాంకాక్ (థాయిలాండ్)లోని ఓ హోటల్లో ఉంటున్నారు. భద్రత కారణాల రీత్యా లోపలే ఉండాలని, బయటకు రావొద్దని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. థాయిలాండ్‌లో
తాత్కాలిక బసకు థాయిలాండ్ అనుమతి
బ్యాంకాక్: దేశం విడిచి వెళ్లిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బ్యాంకాక్ (థాయిలాండ్)లోని ఓ హోటల్లో ఉంటున్నారు. భద్రత కారణాల రీత్యా లోపలే ఉండాలని, బయటకు రావొద్దని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. థాయిలాండ్‌లో ఉన్నంతకాలం అదే హోటల్లో ఉండొచ్చని అధికారులు ఆయనకు చెప్పినట్లు బ్యాంకాక్ పోస్ట్ పత్రిక పేర్కొంది. సింగపూర్‌లో తన వీసా గడువు తీరిపోయిన రోజునే గొటబాయ బ్యాంకాక్‌కు చేరుకున్నారు. మరో దేశంలో శాశ్వతంగా ఆశ్రయం పొందేవరకు ఆయన థాయిలాండ్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటారు. కాగా మానవతా కారణాలతోనే ఆయన తాత్కాలిక బసకు అనుమతి ఇచ్చినట్లు థాయిలాండ్ ప్రధానమంతి ప్రయూత్ చాన్-ఓ-చా బుధవారం వెల్లడించారు. ఇక్కడ ఉన్నంత కాలం ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు సాగించబోనని గొటబాయ హామీ ఇచ్చినట్లు చెప్పారు. గొటబాయ వద్ద ఇప్పటికీ దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నందున ఆయన 90 రోజుల వరకు ఉండొచ్చని థాయిలాండ్ విదేశాంగ మంత్రి ప్రముద్వినై చెప్పారు. ఆయన ఇక్కడ ఉండటానికి శ్రీలంక ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పలేదని.. అలాగే తాము ఆయనకు ఎలాంటి వసతి ఏర్పాట్లు చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా థాయిలాండ్ వీసా గడువు ముగిసిన అనంతరం గొటబాయ నవంబరులో శ్రీలంకకు తిరిగి వస్తారని ఆ దేశంలోని డైలీ మిర్రర్ పత్రిక తెలిపింది. ఆయనకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం నేరుగా థాయిలాండ్‌ను కోరినట్లు కూడా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!