Green Card: ఇకపై ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డుల జారీ!
దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశమిచ్చే ఈగిల్ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మద్దతు ప్రకటించింది.
వాషింగ్టన్: దేశాలవారీ గ్రీన్‌కార్డు కోటా విధానాన్ని రద్దు చేసి పుట్టిన దేశం ప్రాతిపదికపై కాకుండా ప్రతిభ ఆధారంగా సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశమిచ్చే ఈగిల్ చట్టానికి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మద్దతు ప్రకటించింది. చట్టబద్ధ ఉపాధికి సమాన అవకాశాల కల్పన బిల్లును ఈగిల్ చట్టంగా, హెచ్‌ఆర్ 3648గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ఈ వారం ఓటింగ్ జరగనుంది. ఇది కనుక ఆమోదం పొంది, చట్టరూపం ధరిస్తే అమెరికాలో లక్షలాది వలసదారులకు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్‌కార్డు అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండడానికి అనుమతించే అధికార పత్రం. ప్రస్తుతం ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో గ్రీన్‌కార్డులను జారీచేసే విధానం ఉంది. చిన్న చిన్న దేశాల నుంచి ఈ కోటాకు తగిన సంఖ్యలో సిబ్బంది అమెరికాకు రావడం లేదు. దీంతో ఆ దేశాల గ్రీన్‌కార్డు కోటాలు మురిగిపోతున్నాయి. కాగా, భారతదేశం నుంచి అత్యధిక సంఖ్యలో సాంకేతిక నిపుణులు అమెరికా వెళుతున్నా, కోటా విధానం వల్ల వారికి పరిమితంగానే గ్రీన్ కార్డులు లభిస్తున్నాయి. ఇక నుంచి కంపెనీల అవసరాల మేరకు వలస సిబ్బందిని నియమించుకోవడానికి వీలుగా దేశాలవారీ కోటాను తొమ్మిదేళ్ళ వ్యవధిలో ఎత్తివేయాలని ఈగిల్ బిల్లు ప్రతిపాదిస్తోంది. సదరు సమయంలో ఏ దేశానికీ గ్రీన్ కార్డులను నిరాకరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశిస్తోంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో అమెరికాకు వలస వచ్చే నర్సులు, వైద్య చికిత్సా సిబ్బందికి కొన్ని వీసాలను ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చిన నిపుణులతో పాటు వారి వారి దేశాల్లోనే ఉండిపోయిన కుటుంబసభ్యులకూ వీసాలు ఇస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BRS: సమరానికి సై.. పార్లమెంట్లో భారాస వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు