తాడుకు బదులు మనిషి.. స్కిప్పింగ్‌లో యూకే రికార్డు..!

ఈ కొత్త స్కిప్పింగ్‌ ఆటలో ఇద్దరు వ్యక్తులు ఒక మనిషిని తాడులా గిరిగిరా తిప్పుతుంటే.. ఆ వ్యక్తిని తప్పించుకుంటూ ఇంకొకరు గెంతులు వేశారు.

Published : 23 Oct 2022 01:46 IST

లండన్‌: చిత్రవిచిత్రమైన ట్యాలెంట్‌తో ఒళ్లు గగుర్పొడిచే ప్రదర్శన చేస్తుంటారు కొందరు. ట్యూబ్‌లైట్లు మింగడం, మేకులపై నిల్చోవడం వంటివి మనం చూశాం. తాజాగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డు షేర్‌ చేసిన వీడియో కూడా అదే తరహాలోనిది. స్కిప్పింగ్ ఆటకు సంబంధించింది. మన తాడాటను భయానకంగా మార్చి.. పోటీ పెట్టింది. తాడుకు బదులుగా మనిషి ఉంచింది. ఇద్దరు వ్యక్తులు ఒక మనిషిని తాడులా గిరిగిరా తిప్పుతుంటే.. ఆ వ్యక్తిని తప్పించుకుంటూ ఇంకొకరు గెంతులు వేశారు. ‘అత్యంత చౌక అయిన స్కిప్పింగ్ రోప్‌ మనిషే’ అంటూ గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ట్వీట్‌లో రాసుకొచ్చింది. యూకేకు చెందిన గ్రూప్‌ ఒక నిమిషంలో 57 స్కిప్స్‌ పూర్తి చేసి, వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని