Ukraine Crisis: రష్యాతో సైబర్‌ యుద్ధం చేస్తోన్న అనానమస్‌ హ్యాకర్లు..!

సాయం కోసం ఉక్రెయిన్‌ ప్రజలు ప్రపంచ దేశాలను దీనంగా వేడుకొంటున్నా.. నేరుగా ఎవరూ ముందుకు రాలేదు.. ఈ సమయంలో ఓ హ్యాకర్స్‌ గ్రూప్‌ ఉక్రెయిన్‌ వాసులకు అండగా నిలిచి ఏకంగా రష్యాపై సైబర్‌ వార్‌ ప్రకటించింది. అదే అనానమస్‌ గ్రూప్‌.

Updated : 13 Dec 2022 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాయం కోసం ఉక్రెయిన్‌ ప్రజలు ప్రపంచ దేశాలను వేడుకొంటున్నా.. నేరుగా ఎవరూ ముందుకు రాలేదు.. ఈ సమయంలో ఓ హ్యాకర్స్‌ గ్రూప్‌ ఉక్రెయిన్‌ వాసులకు అండగా నిలిచి ఏకంగా రష్యాపై సైబర్‌ వార్‌ ప్రకటించింది. అదే అనానమస్‌ గ్రూప్‌. ఇటీవల పదుల కొద్దీ రష్యన్ వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసింది. తాజాగా రష్యాకు మద్దతుగా ఉన్న చెచెన్య  ప్రబుత్వ వెబ్‌సైట్‌ను ఈ గ్రూప్‌ హ్యాక్‌ చేసింది. ఈ విషయాన్ని అనానమస్‌ ట్విటర్‌లో వెల్లడించింది. దాదాపు 12 గంటలపాటు ఆ వెబ్‌సైట్‌ పనిచేయకుండా చేసినట్లు ఈ గ్రూప్‌ పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌ లో చాలా సేపు ‘404 హోస్ట్‌ నాట్‌ ఫౌండ్‌ ఎర్రర్‌ పేజ్‌’ అనే సందేశం కనిపించింది. రష్యాలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన చెచెన్‌ రిపబ్లిక్‌ కూడా డాన్‌బాస్‌ ప్రాంతం ఆక్రమణకు మద్దతు పలికింది. దాని అధినేత రంజాన్‌ కద్రోవ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు.

గత శుక్రవారం అనానమస్‌ గ్రూప్‌ రష్యాపై సైబర్‌ యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రభుత్వంతోపాటు క్రెమ్లిన్, డూమా, రక్షణశాఖ వెబ్‌సైట్లపై దాడులు చేసింది. దీంతోపాటు ఆర్‌టీ వెబ్‌సైట్‌పై కూడా సైబర్‌ దాడికి పాల్పడింది.  కొన్ని వెబ్‌సైట్‌లు నెమ్మదించగా, మరికొన్ని ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు