America: మరోసారి మంచు గుప్పిట్లో అమెరికా.. 1500కుపైగా విమానాలు రద్దు!
అమెరికాపై మరోసారి మంచు తుపాను విరుచుకుపడింది. దీంతో దాదాపు 1500కుపైగా విమానాలు రద్దయ్యాయి. 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్ లేకుండా పోయింది.
వాషింగ్టన్: అమెరికా(America) మరోసారి శీతాకాలపు మంచు తుపాను(Winter Storm) గుప్పిట్లో చిక్కుకుంది. అగ్రరాజ్యం పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది. దీంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. లాస్ఏంజెల్స్(Los Angeles) సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటా(Minnesota)లో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం(NWS) హెచ్చరించింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది.
డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపొలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్‌లలోనూ పరిస్థితులు దారుణంగా మారాయి. ఫ్లైట్‌అవేర్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం తెల్లవారుజామునాటికి దేశవ్యాప్తంగా 1,550 విమానాలు రద్దయ్యాయి. దాదాపు 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. వాటిలో దాదాపు సగం మిచిగాన్‌లోనే ఉన్నాయి. ప్రమాదకర శీతాకాలపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా ఒకవైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలితో వణుకుతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగత్రలు నమోదవుతుండటం గమనార్హం. ముఖ్యంగా ఒహైయో వ్యాలీ, మధ్య అట్లాంటిక్‌లలో సగటు కంటే 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?