Canada: పన్నూపై నిషేధం విధించండి.. కెనడా హిందూ గ్రూపుల విజ్ఞప్తి

సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నేత పన్నూ కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు హెచ్‌ఎఫ్‌సీ ప్రతినిధి కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రిని కలిసి వినతి సమర్పించారు.  

Updated : 27 Sep 2023 15:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ టెర్రరిస్టు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై కెనడా(Canada)లో నిరసన పెరుగుతోంది. అతడు హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో ది హిందూ ఫోరం కెనడా (హెచ్‌ఎఫ్‌సీ) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అతడు భారతీయుల్లో భయాన్ని పెంచుతున్నాడని ఆరోపించింది. 

హెచ్‌ఎఫ్‌సీకి చెందిన లీగల్‌ కౌన్సిల్‌ పీటర్‌ థ్రోనింగ్‌ నిన్న దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ను కలిశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎఫ్‌సీ ఆందోళనను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్మిగ్రేషన్‌ శాఖ తగిన దర్యాప్తు జరిపి పన్నూపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘గురపత్వంత్‌సింగ్‌ పన్నూ అమెరికాకు చెందిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌కు ప్రతినిధిగా ఉన్నారు. అతడు సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో అతడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యపై ప్రకటన విడుదల చేశాడు. ఇప్పటికే పన్నూ, అతడి గ్రూపుపై భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. అతడు హింసాత్మక వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అతడు ఇటీవల ప్రకటన చేసిన సమయంలో కెనడాలో ఉన్నాడా అనే విషయంపై దర్యాప్తు చేయాలి. ఆ సమయంలో ఇక్కడ ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. అతడిని కెనడాలోకి రాకుండా నిషేధించాలి’’ అని హెచ్‌ఎఫ్‌సీ తరపు పీటర్‌ కోరారు. 

పెండింగ్‌లో 70 కొలీజియం సిఫార్సులు

సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్జీఎఫ్‌) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై ఇప్పటికే భారత్‌ కన్నెర్ర చేసింది. పంజాబ్‌లోని ఆ వేర్పాటువాద నేత ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం జప్తు చేసింది. ఖలిస్థాన్‌ మద్దతుదారుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య అంశంపై కెనడాతో వివాదం రగులుతున్నవేళ.. సామాజిక మాధ్యమాల్లో హిందువులపై పన్నూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. కెనడా విడిచి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశాడు. మరో వీడియోలో కెనడాలోని భారత దౌత్య సిబ్బందిని కూడా బెదిరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని