Harvey Weinstein: ఇటాలియన్ నటిపై అత్యాచారం.. దోషిగా తేలిన ‘MeToo’ కారకుడు!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ తాజాగా మరో అత్యాచార కేసులో దోషిగా తేలాడు. 2017లో ఆయనపై ఆరోపణలే.. ‘మీటూ’ ఉద్యమానికి దారితీసిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్(70).. తాజాగా మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఓ ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్ కోర్టు నిర్ధారించింది. 12 మంది సభ్యుల జ్యూరీ.. దాదాపు నెల రోజులపాటు విచారణ జరిపి, తొమ్మిది రోజుల చర్చ అనంతరం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అత్యాచారం, లైంగిక దాడి వంటి ఏడు అభియోగాల్లో మూడింటిలో అతన్ని(Harvey Weinstein) దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజా తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
మొత్తం నలుగురు బాధితుల కేసులను కోర్టు ఈ సందర్భంగా విచారించింది. 2010లో ఓ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మసాజ్ థెరపిస్ట్ చేసిన ఆరోపణల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్‌కు సంబంధించిన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుతోపాటు మరో మహిళ కేసులో జ్యూరీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ప్రొసిడింగ్‌లో లోపం కారణంగా వాటిని ‘చెల్లని విచారణ(Mistrial)లు’గా ప్రకటించింది. అయితే, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు హార్వే తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నట్లు అతని తరఫు ప్రతినిధులు తెలిపారు.
దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో పేరొందిన నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్.. తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, ఇతర మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. 2017లో హార్వేపై ఈ ఆరోపణలు మొదలయ్యాయి. ఈ పరిణామాలే.. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ’ ఉద్యమాని(MeToo Movement)కి దారితీశాయి. 2018 మేలో హార్వే పోలీసులకు లొంగిపోయాడు. ‘కేసు విచారణ క్రమంలో వీన్‌స్టీన్ న్యాయవాదులు నన్ను నరకంలో పడేశారు. కానీ, న్యాయం లభించే రోజు వస్తుందని తెలుసు. అతను జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుతున్నా’ అని తీర్పు అనంతరం ఆ ఇటాలియన్ నటి ఒక ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో
-
Rajnath: DAD.. రక్షణశాఖ నిధులకు సంరక్షకుడు: రాజ్‌నాథ్
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!