Kabul: కాబుల్‌ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడి లేదా మరణించి ఉంటారని  సమాచారం. 

Updated : 18 Aug 2022 05:33 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడి లేదా మరణించి ఉంటారని  సమాచారం. బుధవారం సాయంత్రం ప్రార్థన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి పోలీసులు పేర్కొన్నారు.  అయితే ఎంత మంది చనిపోయారో ఇప్పుడే  వెల్లడించలేమని తెలిపారు. సుమారు 35 మంది గాయపడి లేదా మరణించి ఉండొచ్చని తాలిబన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. 20 మంది చనిపోయి ఉంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 27 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చేరారని స్థానిక ఎమర్జెన్సీ ఆసుపత్రి తమ ట్విటర్‌లో పేర్కొంది. వీరిలో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది. 

కాబుల్‌ ఉత్తరప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు, సమీపంలోని భవనాలు కిటికీలు పగిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చనిపోయిన వారిలో మసీదు ఇమామ్‌ కూడా ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని