Putin: ఐసీసీ అరెస్ట్ వారెంట్.. పుతిన్‌పై ప్రభావమెంత?
రష్యా అధినేత పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఏమాత్రం లేవు.
మాస్కో: రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin)కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్(Ukraine)లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాల(War Crimes)కు బాధ్యుడిగా పేర్కొంటూ ఈ మేరకు వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. అయితే.. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్(Kremlin) ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు.. పుతిన్‌ను అదుపులోకి తీసుకునే అవకాశాలు అసాధ్యమని నివేదికలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే.. మారణహోమం, మానవతాపై దాడులు, యుద్ధ నేరాల వంటి అత్యంత తీవ్రమైన నేరాలను ఐసీసీ విచారిస్తుందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ తెలిపింది. కానీ, ఐసీసీకి అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు లేవు. ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు. దీంతో అనుమానితులను అప్పగించడం అసాధ్యం. మరోవైపు.. అధ్యక్షుడిగా పుతిన్‌కు స్వదేశంలో సర్వాధికారాలు ఉన్నాయి.
రష్యాలో ఉన్నంత వరకు.. పుతిన్‌కు అరెస్టు భయం లేదు. ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రయాణాల విషయంలో పుతిన్ అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. పుతిన్‌పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో.. ఐసీసీ ఆదేశాలు అమలు చేయాలనుకునే దేశంలో పుతిన్ పర్యటించడం కుదరదు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాపై కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
లింగమనేని రమేష్ ఇల్లు జప్తుపై నిర్ణయానికి అనిశా కోర్టు నిరాకరణ
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?