Putin: పుతిన్‌ యుద్ధంలో ఓడిపోతే..: కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ దౌత్యవేత్త

రష్యా(Russia) నిర్వహిస్తోన్న సైనిక చర్యకు ఇంకా ఎలాంటి ముగింపు కనిపించడం లేదు. ఈ క్రమంలో పుతిన్‌ను ఉద్దేశించి ఓ మాజీ దౌత్యవేత్త ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Published : 14 Mar 2023 16:51 IST

మాస్కో: ఏడాదికాలంగా ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా సైనిక చర్య చేపడుతోంది. రోజుల్లో ముగిద్దామనుకున్న యుద్ధంలో.. ఎదురుదెబ్బలు తింటోంది. పశ్చిమ దేశాల సైనిక సాయంతో పుతిన్(Putin) సేనల దాడులను ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది. యుద్ధంలో ఎవరికి విజయావకాశాలున్నాయనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ఈ క్రమంలో రష్యా(Russia) మాజీ దౌత్యవేత్త ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘పుతిన్(Putin) ఈ యుద్ధంలో గెలవలేకపోతే.. ఆయన బలవంతంగా గద్దె దిగాల్సి రావొచ్చు. పుతిన్ స్థానంలోకి మరొకరు రావొచ్చు. ఆయన సూపర్‌ హీరో కాదు. ఆయనకు ఎలాంటి సూపర్‌ పవర్స్ లేవు. ఆయనొక సాధారణ నియంత. చరిత్రను చూస్తే.. ఇలాంటి నియంతలు తమ పదవులను కోల్పోయిన ఘటనలు కనిపిస్తాయి. అలాగే ఈ దురాక్రమణ దారులు యద్ధంలో ఓడిపోతే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే.. అలాగే వెళ్లిపోతారు’ అని వెల్లడించారు. ఈ దౌత్యవేత్త పేరు బోరిస్‌ బొండారెవ్‌. రష్యా దురాక్రమణను నిరసిస్తూ ఆయన  తన పదవికి రాజీనామా చేశారు. 

ప్రస్తుతం బక్ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్‌(Ukraine) రష్యా బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.  రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్‌ వద్ద పోరాడుతోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. దాంతో పెద్దసంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని