Putin: పుతిన్ యుద్ధంలో ఓడిపోతే..: కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ దౌత్యవేత్త
రష్యా(Russia) నిర్వహిస్తోన్న సైనిక చర్యకు ఇంకా ఎలాంటి ముగింపు కనిపించడం లేదు. ఈ క్రమంలో పుతిన్‌ను ఉద్దేశించి ఓ మాజీ దౌత్యవేత్త ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
మాస్కో: ఏడాదికాలంగా ఉక్రెయిన్(Ukraine)పై రష్యా సైనిక చర్య చేపడుతోంది. రోజుల్లో ముగిద్దామనుకున్న యుద్ధంలో.. ఎదురుదెబ్బలు తింటోంది. పశ్చిమ దేశాల సైనిక సాయంతో పుతిన్(Putin) సేనల దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. యుద్ధంలో ఎవరికి విజయావకాశాలున్నాయనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ఈ క్రమంలో రష్యా(Russia) మాజీ దౌత్యవేత్త ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పుతిన్(Putin) ఈ యుద్ధంలో గెలవలేకపోతే.. ఆయన బలవంతంగా గద్దె దిగాల్సి రావొచ్చు. పుతిన్ స్థానంలోకి మరొకరు రావొచ్చు. ఆయన సూపర్ హీరో కాదు. ఆయనకు ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. ఆయనొక సాధారణ నియంత. చరిత్రను చూస్తే.. ఇలాంటి నియంతలు తమ పదవులను కోల్పోయిన ఘటనలు కనిపిస్తాయి. అలాగే ఈ దురాక్రమణ దారులు యద్ధంలో ఓడిపోతే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే.. అలాగే వెళ్లిపోతారు’ అని వెల్లడించారు. ఈ దౌత్యవేత్త పేరు బోరిస్ బొండారెవ్. రష్యా దురాక్రమణను నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం బక్ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్(Ukraine) రష్యా బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాకు చెందిన ప్రైవేటు సైన్యం అత్యంత క్రూరమైన వ్యూహాలతో ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన బక్ముత్ వద్ద పోరాడుతోందని ఇదివరకు వార్తలు వచ్చాయి. దాంతో పెద్దసంఖ్యలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో హమాస్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందు నాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు వీడతామని చెప్పారు. -
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
డీప్ ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు (cyber crime) చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. -
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జో బైడెన్ (Biden), డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. -
దేశాల మధ్య డీప్‌ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్‌ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్‌లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్‌కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్‌తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్‌లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం