Published : 30 Jun 2022 02:09 IST

Boris Johnson: ‘పుతిన్‌ ఓ మహిళే అయితే’.. రష్యా అధ్యక్షుడిపై బ్రిటన్‌ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు!

లండన్‌: ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం (Ukraine Crisis) కొనసాగిస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు మండిపడుతూనే ఉన్నాయి. ఓవైపు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే మరోవైపు రష్యాపై ఆంక్షలు విధిస్తూ పుతిన్‌ సేనను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) రష్యా అధ్యక్షుడి (Vladimir Putin)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పుతిన్‌ మహిళే అయితే ఇటువంటి భీకర యుద్ధం మొదలు పెట్టకపోయేవారని అన్నారు. 

‘వాస్తవానికి వ్లాదిమిర్‌ పుతిన్‌ మహిళ కాదు. కానీ, ఒకవేళ ఆయన మహిళే అయితే, ఇప్పుడు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌పై పిచ్చి, పురుషాహంకార (Macho) దురాక్రమణను మొదలు పెట్టేవారు కాదని అనుకుంటున్నా. పుతిన్‌ దండయాత్ర అనేది విషపూరితమైన పురుషత్వానికి సరైన ఉదాహరణ’ అని జర్మనీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు మెరుగైన విద్య అందించాలని పిలుపునిచ్చిన ఆయన.. చాలా మంది మహిళలు అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలోనే పుతిన్‌ తీరును ఉదహరించారు. భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ఏవిధంగా ఎదుర్కోవాలనే విషయంపై చర్చించేందుకు నాటో దేశాలు సమావేశమయ్యే కొద్దిసేపటి ముందు బోరిస్‌ జాన్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ యుద్ధం ముగిసిపోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని.. కానీ, అందుకు ప్రస్తుతం ఏవిధమైన పరిష్కార మార్గాలూ కనిపించడం లేదని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. శాంతి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎటువంటి ప్రయత్నాలూ చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఒకవేళ మాస్కోతో శాంతిచర్చలు సాధ్యమైతే మాత్రం అప్పుడు ఉక్రెయిన్‌ను ఉత్తమమైన స్థితిలో ఉంచడానికి పాశ్చాత్య మిత్రదేశాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని