Donald Trump: నేను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ హక్కు ఉండదు: ట్రంప్
అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వ హక్కు రాకుండా మార్పులు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇంటర్నెట్‌డెస్క్: అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే చిన్నారులకు లభించే పౌరసత్వ హక్కును తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ ప్రచార వీడియో ఒక దానిని ఆయన కుమారుడు ట్రంప్ జూనియర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో బర్త్ రైట్స్ అంశాన్ని సీనియర్ ట్రంప్ ప్రస్తావించారు.
వాస్తవానికి ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధం. చిన్నారులకు అమెరికాలో పుట్టుకతో లభించే పౌరసత్వాన్ని ఆ దేశ రాజ్యాంగం 14వ సవరణతో అందించారు. దీనికి అమెరికా చట్టసభ 1868లో ఆమోదించింది. ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టగానే తొలి రోజే ఈ హక్కును రద్దు చేస్తానని పేర్కొన్నారు. పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం లేదా చట్టపరంగా అమెరికాలో నివసించే హక్కు ఉండాల్సిందేని ట్రంప్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 2018లో ట్రంప్ ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయాలని ట్రంప్ భావించారు.. కానీ, తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
జోబైడెన్ తీరును ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో వలసదారులు అమెరికాలోకి చొరబడుతున్నారని విమర్శించారు. పిల్లలకు పుట్టుకతో లభించే పౌరసత్వ హక్కు వలసదారులను ఎక్కువగా ఆకర్షిస్తోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
-
Rajinikanth: కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!