Covid: థైరాయిడ్‌ గ్రంథిపై కొవిడ్‌ ప్రభావం

కొవిడ్‌ తీవ్రరూపం ధరిస్తే థైరాయిడ్‌ గ్రంథిని ప్రభావితం చేస్తుందనీ, ఆ దుష్ప్రభావం ఏడాది గడచిపోయిన తరవాత కూడా కనిపిస్తుందని ఇటలీలోని మిలాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్‌ లక్షణాల తీవ్రత మధ్యస్థంగానూ, తీక్షణ స్థాయిలోనూ

Published : 30 Jun 2022 07:56 IST

లండన్‌: కొవిడ్‌ తీవ్రరూపం ధరిస్తే థైరాయిడ్‌ గ్రంథిని ప్రభావితం చేస్తుందనీ, ఆ దుష్ప్రభావం ఏడాది గడచిపోయిన తరవాత కూడా కనిపిస్తుందని ఇటలీలోని మిలాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్‌ లక్షణాల తీవ్రత మధ్యస్థంగానూ, తీక్షణ స్థాయిలోనూ ఉన్నప్పుడు థైరాయిడ్‌ గ్రంథి వాపునకు గురవుతుంది. మెదడులోని హైపోథాలమస్‌- పిట్యూటరీ- థైరాయిడ్‌ గ్రంథులు కొవిడ్‌ దుష్ప్రభావానికి గురవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుందని మిలాన్‌లో 24వ ఐరోపా వినాళగ్రంథుల శాస్త్ర మహాసభకు సమర్పించిన అధ్యయన నివేదికలో ఇటాలియన్‌ శాస్త్రజ్ఞులు వివరించారు. మానవ దేహంలో జీవక్రియలకు, ఎదుగుదలకు థైరాయిడ్‌ గ్రంథి చాలాముఖ్యం. స్త్రీలు గర్భిణులుగా ఉన్నప్పుడూ థైరాయిడ్‌ ఎక్కువ హార్మోనులను విడుదల చేస్తుంది. శరీరానికి కావలసిన అదనపు శక్తిని అవి సమకూరుస్తాయి. తీవ్ర కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన 100 మందిపై దీర్ఘ అధ్యయనం చేయగా వారిలో  తరచుగా థైరాయిడ్‌ వాపు కనిపించింది. కొవిడ్‌ తగ్గిన తరవాత అందరిలో థైరాయిడ్‌ పనితీరు సాధారణ స్థితికి వచ్చింది. కానీ, 12 నెలల తరవాత కూడా సగం మందిలో థైరాయిడ్‌ వాపు చిహ్నాలు పూర్తిగా తొలగిపోలేదు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో దాని ఆనవాళ్లు కనిపించాయి. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని