Published : 22 May 2022 01:53 IST

Imran Khan: ఫాసిస్టు పాలన.. ఆమెను హింసించి అపహరించుకెళ్లారు: ఇమ్రాన్‌ ఆగ్రహం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ప్రస్తుత ఫాసిస్టు ప్రభుత్వం తమ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి షిరీన్‌ మజారీని హింసాత్మకంగా అపహరించుకెళ్లిందంటూ పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మండిపడ్డారు. ఆమె ఇంట్లో ఉండగా ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరించి హింసించి అపహరించుకెళ్లిందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘మా పార్టీ సీనియర్‌ నాయకురాలు షిరీన్‌ మజారీని ఈ ఫాసిస్టు పాలనలో హింసించి అపహరించుకుపోయారు. ఆమె చాలా దృఢమైనది. ధైర్యం ఎక్కువ. ఈ ఫాసిస్టు దిగుమతి ప్రభుత్వం ఆమెను భయపెట్టాలని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్టే’’ అని ట్వీట్‌ చేశారు. కొందరు మగ పోలీసులు నిన్న తమ ఇంటికి వచ్చి తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని షిరిన్‌ మజారీ కుమార్తె ఇమాన్‌ జైనాబ్‌ మజారి హజిర్‌ తెలిపారు. లాహోర్‌కు చెందిన అవినీతి నిరోధక విభాగానికి చెందినవారిగా చెప్పి తీసుకెళ్లారంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

మరోవైపు, తమ పోరాటం పూర్తిగా శాంతియుతమైందని, కానీ ఈ దిగుమతి ఫాసిస్టు ప్రభుత్వం మాత్రం గందరగోళం వైపు నెట్టాలని ప్రయత్నిస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను తిరోగమనం పట్టించింది చాలదన్నట్టుగా.. ఇప్పుడు ఎన్నికలను కూడా జరగనీయకుండా అరాచకాన్ని కోరుకుంటున్నారన్నారు. నేడు నిరసనలు తెలిపి.. రేపటి సీసీ సమావేశం తర్వాత లాంగ్‌ మార్చ్‌ ప్రకటిస్తానన్నారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని