Imran Khan: గాడిద ఎప్పటికీ గాడిదే.. పాక్‌ మాజీ ప్రధాని ఫన్నీ కామెంట్‌

మొన్నటివరకు వార్తల్లో నిలిచిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ఆసక్తిగా మారింది.

Published : 07 May 2022 01:44 IST

సోషల్‌ మీడియాలో ఇమ్రాన్‌ఖాన్‌ వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: ఇటీవల పాకిస్థాన్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. చివరకు అవిశ్వాస తీర్మానంలో ఓటమిపాలై పదవి కోల్పోయిన వ్యక్తిగా ఇమ్రాన్‌ ఖాన్‌ చరిత్రలో నిలిచిపోయారు. అయితే, మొన్నటివరకు అలా వార్తల్లో నిలిచిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ఆసక్తిగా మారింది. ‘గాడిద ఎప్పటికీ గాడిదే’ అంటూ చేసిన ఫన్నీ కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘బ్రిటన్‌లో ఎక్కువకాలం గడిపాను. అక్కడ ఎంతోమంది స్నేహితులు, అభిమానులు నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఆ దేశాన్ని నేనెప్పుడూ సొంతిల్లు మాదిరిగా పరిగణించలేదు. నేను ఎప్పటికీ తొలుత పాకిస్థానినే. గాడిదకు కేవలం రంగులు వేసినంత మాత్రాన అది చారల గుర్రం (Zebra) కాలేదు. గాడిద ఎప్పటికీ గాడిదే’ అని చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.

ప్రధాని పదవి కోల్పోయిన అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ (Podcast) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాలతో తనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్థాన్‌ నా మాతృభూమి అంటూ వివరించారు. ఆ సమయంలో ఆయన వాడిన ఫన్నీ కామెంట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని