
Imran Khan: ఏ దేశానికీ వ్యతిరేకం కాదు.. స్వరం మార్చిన ఇమ్రాన్!
ఇస్లామాబాద్: ఇటీవల అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి కోల్పోయిన పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వరం మార్చారు. ఇప్పటి వరకు తనని గద్దె దింపడానికి విదేశీ శక్తులు కుట్రపన్నాయని ఆరోపించిన ఆయన.. తాజాగా ఆయా దేశాల పట్ల మెతక వైఖరి వెలిబుచ్చారు. తనకు భారత్ సహా ఏ దేశంపై ద్వేషం లేదని చెప్పుకొచ్చారు.
ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కరాచీలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకరకంగా ఆయన దీన్ని బలప్రదర్శనగా చూపించదలిచారు. అక్కడి జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఇమ్రాన్ ‘‘నేను ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. భారత్, ఐరోపా, అమెరికా.. దేన్నీ నేను ద్వేషించను. నేను ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు’’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వివిధ వేదికలపై గతంలో ఇమ్రాన్ భారత్, అమెరికా సహా కొన్ని ఐరోపా దేశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
పదవి కోల్పోవడానికి కొన్ని రోజుల ముందు విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇమ్రాన్ తన పార్టీవర్గాలకు పిలుపునిచ్చారు. తాను రష్యా పర్యటనకు వెళ్లడం ఇష్టంలేని అమెరికాయే ఈ కుట్రను ఎగదోస్తోందంటూ అగ్రరాజ్యంపై ధ్వజమెత్తారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ఓటేయాని ఐరోపా సమాఖ్య కోరగా.. ‘‘మీరెలా చెబితే అలా వినడానికి మీమేమైనా మీ బానిసలమా?’’ అని విరుచుకుపడ్డారు. ఇక పదవిలో ఉన్న సమయంలో భారత్‌లో ఆయన చిమ్మిన విషం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
అయితే, తాను పదవికి దూరమవడానికి కొద్దిరోజుల ముందు నుంచీ భారత్‌పై ఇమ్రాన్ తన వైఖరికి భిన్నంగా వ్యవహరించారు. పలు సందర్భాల్లో భారత విధానాలపై ప్రశంసలు కురిపించారు. భారత్‌ను ఏ శక్తీ శాసించలేదనీ.. వారు ఆత్మాభిమానం కలవారని కొనియాడారు. అలాగే భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sammathame: ఓటీటీలోకి ‘సమ్మతమే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Technology News
WhatsApp: వాట్సాప్‌లో ఐదు కొత్త ఫీచర్లు.. ఏమేం రానున్నాయంటే?
-
Sports News
HBD DHONI:‘ధోనీ’కి శుభాకాంక్షల వెల్లువ
-
India News
ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్
-
General News
Telangana News: హైదరాబాద్‌లో ఏరోస్పేస్ యూనివర్సిటీ
-
General News
Telangana News: ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్‌లో మార్పులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!