
Booster shot: బూస్టర్ డోసు వేసుకుంటేనే ఆ నగరంలోకి ఎంట్రీ..
అబుదబి: ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్రరూపం దాల్చింది. పలు దేశాల్లో ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల బాటపట్టాయి. కొన్ని దేశాలు విదేశీ రాకపోకలు, పర్యటనలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే.. బూస్టర్ డోసు తప్పనిసరి చేసింది అక్కడి అధికార యంత్రాంగం. రెండో డోసు వేసుకున్న ఆరు నెలలకు బూస్టర్ షాట్ తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్లు పరిగణించనున్నట్లు వెల్లడించింది. అబుదాబిలో ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి టీకా స్థితిని తెలియజేసే గ్రీన్ పాస్‌ను చూపించాలనే నిబంధన పెట్టింది.
జపాన్‌లో ఆంక్షల పొడిగింపు..!
ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విధించిన ఆంక్షలను మరింత కాలం పొడిగించాలని జపాన్ సర్కారు యోచిస్తోంది. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుని.. శుక్రవారం నుంచి ఆంక్షలను అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదే జరిగితే.. ఒకినావా, యమగూచి, హిరోషిమాతో సహా 16 ప్రాంతాల్లో మరో మూడువారాలు పాటు కొవిడ్ ఆంక్షలు కొనసాగుతాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.