Russia oil: 3 నెలల్లో 24 బి.డాలర్ల రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్‌, చైనా

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మూడు నెలల్లో భారత్‌, చైనాలు కలిసి మొత్తం 24 బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేశాయి. అమెరికా, ఐరోపా

Published : 07 Jul 2022 01:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మూడు నెలల్లో భారత్‌, చైనాలు కలిసి మొత్తం 24 బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేశాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ కొనుగోళ్లు జరిగాయి. మేతో ముగిసే మూడునెలలకు చైనా మొత్తం 18.9 బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేయగా.. భారత్‌ అదే సమయంలో 5.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకొంది. గతేడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం.

అమెరికా, ఇతర ఐరోపా దేశాలు రష్యా నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో.. ఆ లోటును భర్తీ చేయడానికి భారత్‌, చైనా కొనుగోళ్లు ఉపయోగపడ్డాయి. రష్యా మార్కెట్‌ ధరపై ఎంత డిస్కౌంట్‌ ఇచ్చి విక్రయాలు జరిపినా.. గతేడాదితో పోలిస్తే ధరలు ఎక్కువగానే ఉన్నాయి. భారత్‌, చైనాలు ఈ ఏడాది ఎంత పోటీపడి కొనుగోళ్లు చేసినా.. ఇప్పటి వరకూ ఐరోపా దేశాలు చేసిన కొనుగోళ్ల కంటే తక్కువగానే ఉండటం విశేషం.

రష్యాకు భారత్‌, చైనాతో దీర్ఘకాలంగా వ్యూహాత్మక అనుబంధం ఉండటంతో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేసింది. అదే సమయంలో స్థానిక కరెన్సీల్లో కూడా చెల్లింపులను అంగీకరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా కోసం ఏకంగా సైబీరియా నుంచి ప్రత్యేక పైపు లైను ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని