Sundar Pichai: ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే: సుందర్ పిచాయ్
భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా అందుకున్నారు.
వాషింగ్టన్: ‘‘భారత్ నాలో భాగం. నేను ఎక్కడికెళ్లినా ఆ వారసత్వాన్ని తీసుకెళ్తాను’’ అంటున్నారు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్. భారత ప్రభుత్వం అందించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మభూషణ్ అవార్డును పిచాయ్ తాజాగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఈ అపారమైన గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను తీర్చిదిద్దిన దేశం నుంచి ఈ గౌరవం పొందడం గర్వంగా భావిస్తున్నా. భారత్ నాలో భాగమే. నేను ఎక్కడికివెళ్లినా ఆ వారసత్వాన్ని నా వెంట తీసుకెళ్తా’’ అని పిచాయ్ ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరంగా భారత్‌లో వేగంగా మార్పులు వస్తున్నాయని, భారత్‌లో సృష్టించిన ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచానికి మేలు చేస్తున్నాయని ఆయన కొనియాడారు. గూగుల్, భారత్ మధ్య ఉన్న గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తాను ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్.. దేశాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. భారత్‌లో గూగుల్ పెట్టుబడులు కొనసాగించడం గర్వంగా భావిస్తున్నా. మన గడప వరకు చేరే ప్రతి సాంకేతికత మన జీవితాలను మరింత మెరుగుపరుస్తుంది’’ అని పిచాయ్ అన్నారు.
ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ వరించింది. ఈ పురస్కారాన్ని అమెరికాలోని భారత రాయబార రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు నుంచి పిచాయ్ శుక్రవారం(అమెరికా కాలమానం ప్రకారం) అందుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో పిచాయ్ కుటుంబసభ్యులతో పాటు భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఉన్నారు.
ప్రపంచ అగ్రగామి సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓ అయిన సుందర్ పిచాయ్ చెన్నైలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చేసిన పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ బాధ్యతలు చేపట్టారు. అత్యంత విజయవంతమైన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, యాప్స్ ఆవిష్కరణ బృందాలకు నేతృత్వం వహించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: నాపై కోడిగుడ్లూ విసిరారు: చిరంజీవి
-
World News
Joe Biden: మా జోలికొస్తే ఏం చేస్తామో చూపించాం.. చైనాకు బైడెన్ గట్టి వార్నింగ్
-
General News
Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..‘స్టేటస్-కో’కు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Movies News
Rashmika: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది : రష్మిక
-
Politics News
Kotamreddy: అన్నింటికీ తెగించిన వాళ్లే నాతో ఉన్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Movies News
Upasana: కియారాకు సారీ చెప్పిన ఉపాసన