Published : 18 Feb 2022 01:24 IST

మన ఎంపీలపై సింగపూర్‌ ప్రధాని వ్యాఖ్యలు.. భారత్‌ అభ్యంతరం

దిల్లీ: సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ తాజాగా భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సింగపూర్‌ పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న సమయంలో భారత పార్లమెంట్‌ గురించి ప్రస్తావించిన ఆయన.. నెహ్రూ ఇండియాగా సంబోధించారు. అంతేకాకుండా సగానికిపైగా భారత పార్లమెంట్‌ సభ్యులు క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇలా సింగపూర్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సింగపూర్‌ హైకమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు విదేశాంగశాఖ పేర్కొంది.

సింగపూర్‌ పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలో వివరించిన ప్రధాని లీ సీన్‌ లూంగ్‌.. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పేరును కూడా ప్రస్తావించారు. ‘నేడు అనేక రాజకీయ వ్యవస్థలు వాటి వ్యవస్థాపక నాయకులను గుర్తించడం లేదు. ఇజ్రాయెల్‌లో కేవలం రెండేళ్లలోనే నాలుగుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ బెన్‌-గురియన్‌ (ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని) మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. అదే సమయంలోనే కొందరు సీనియర్‌ నాయకులు, మరికొందరు ఉన్నతాధికారులు జైలుకు వెళ్లారు. ఇక నెహ్రూ ఇండియాలోనూ ఇటువంటి పరిస్థితి. మీడియా నివేదికల ప్రకారం, అక్కడి లోక్‌సభలో దాదాపు సగానికి పైగా సభ్యులు అత్యాచారం, హత్య వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల్లో చాలావరకు రాజకీయ ప్రేరేపితమే’ అంటూ సింగపూర్‌ ప్రధాని లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ కాపాడుకుంటున్న విధానాలను తర్వాతి తరాలు కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ అక్కడి సభ్యులకు హితవు పలికారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని