Pakistan: ఓఐసీ పాకిస్థాన్‌ బాకాలా పనిచేస్తోంది: భారత్‌

వోఐసీ సంస్థ పాకిస్థాన్‌(Pakistan) బాకాలా పనిచేస్తోందని భారత్‌  (India) మండిపడింది. భారత్‌ అంతర్గత విషయాల్లో ఆ సంస్థకు ఎటువంటి పాత్ర లేదని పేర్కొంది. 

Updated : 13 Dec 2022 19:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసీ) తీరుపై భారత్‌ (India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ విశ్వాసాన్ని కోల్పోతోందంటూ విమర్శించింది. ఇటీవల ఓఐసీ సెక్రెటరీ జనరల్‌ హిస్సెయిన్‌ బ్రహిమ్‌ తవా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను సందర్శించారు. భారత్‌ (India) జరుపుతున్న షెల్లింగ్‌తో ప్రభావితమైన వారి కోసం అక్కడ జరిపిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ ప్రకటన వెలువడింది. ‘‘భారత్‌లోని భాగమైన జమ్ము కశ్మీర్‌లో ఓఐసీకి ఎటువంటి పాత్రలేదు. ఓఐసీ లేదా దాని సెక్రటరీ జనరల్‌ భారత్‌ (India) అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ హెచ్చరించారు.

ఓఐసీ సెక్రటరీ జనరల్‌ పాకిస్థాన్‌ (Pakistan) బాకా వలే పనిచేస్తున్నారని బాగ్చీ పేర్కొన్నారు. ఓఐసీకూడా పూర్తిగా పచ్చి మతపరమైన పక్షపాత, వాస్తవాలను వక్రీకరించే విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. భారత్‌ (India)లో ఉన్న జమ్ము కశ్మీర్‌ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే దుర్మార్గపు అజెండాలో భాగస్వామి కాకూడదని భారత్‌ (India) ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని