Published : 27 Jun 2022 15:07 IST

Usa: అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సంతతికి చెందిన ఓ 31ఏళ్ల వ్యక్తి.. అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన మేరిల్యాండ్స్‌లోని సౌత్‌ ఓజోన్‌ పార్క్‌లో చోటు చేసుకొంది. సతనమ్‌ సింగ్‌ అనే వ్యక్తి  తన ఇంటికి కొద్ది దూరంలో నలపు రంగు జీప్‌ రాంగ్లర్‌ సహార కారులో కూర్చొని ఉండగా.. ఓ దుండగుడు అతడి తలకు తుపాకీ గురిపెట్టి కాల్పులు జరిపాడు. సింగ్‌ తన మిత్రుడి వద్ద నుంచి ఆ వాహనాన్ని ఘటనకు కొద్ది సేపటి ముందే తీసుకున్నాడు.

ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. హంతకులు సింగ్‌ను చంపేందుకు వచ్చారా..? లేదా ఆ వాహనం యజమానిని  చంపేందుకు వచ్చారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. సతనమ్‌ సింగ్‌ను చంపిన హంతకులు ఒక సిల్వర్‌ కలర్‌ సెడాన్‌లో వచ్చినట్లు కొందరు సాక్షులు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన సాయిచరణ్‌ అనే యువకుడిని ఇటీవల మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో హత్య చేసిన విషయం తెలిసిందే. అతడు కూడా కారులో కూర్చొన్న సమయంలో కాల్పులు జరిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని