కింగ్ ఛార్లెస్ 3 మొదటి పుట్టిన రోజు వేళ.. భారత సంతతి ప్రముఖులకు సత్కారం
King Charles III: బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 పుట్టినరోజును పురస్కరించుకుని పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను సత్కరించనున్నారు. ఇందులో భారత సంతతి వ్యక్తులకు కూడా చోటు దక్కడం విశేషం.
లండన్: బ్రిటన్ రాజుగా ఛార్లెస్ 3 (King Charles III) తొలిసారి అధికారిక పుట్టినరోజు (Official Birthday) చేసుకుంటున్నారు. లండన్ వేదికగా మరికొద్ది గంటల్లో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అధికారిక పుట్టినరోజును పురస్కరించుకుని ‘ట్రూపింగ్ ది కలర్’ (Trooping the Colour) పరేడ్ అట్టహాసంగా జరగనుంది. కాగా.. ఈ వేడుకల్లో కొందరు ప్రముఖులను పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ జాబితాను (Birthday Honours List) యూకే ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందులో 40 మందికి పైగా భారత సంతతి (Indian origin) వ్యక్తులు ఉండటం విశేషం.
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్‌నకు చెందిన గ్లోబల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డా. పర్వీందర్ కౌర్ ఆలే ఈ జాబితాలో ఉన్నారు. కొవిడ్ సమయంలో వ్యాక్సినేషన్‌కు ఆమె అందించిన సేవలకు గానూ పర్వీందర్‌ను ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE) పురస్కారంతో సత్కరించనున్నారు. సర్జరీ, సైన్స్ రంగంలో అందించిన సేవలకు గానూ లండన్‌లోని కింగ్స్ కాలేజీలో ప్రొఫెసర్ ప్రోకర్ దాస్‌గుప్తాకు కూడా ఇదే గౌరవం లభించనుంది.
ఇక, గ్రాంట్ థార్న్‌టన్ యూకే ఎల్‌ఎల్‌పీలో దక్షిణాసియా బిజినెస్ గ్రూప్ హెడ్ అంజు చాందే, సోల్ కాస్మెడిక్స్ ఫౌండర్ హీనా సోలంకి, గైనకాలజిస్ట్ అంజు కుమార్, యూకే గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ సునంద్ ప్రసాద్ తదితరులు ఈ జాబితాలో ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం అందుకోనున్నారు. ఇక, వయలినిస్ట్ జ్యోత్స్న శ్రీకాంత్, ఫిజియోథెరపిస్ట్ రోమా భోపాల్ వంటి వారికి మెంబర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) పురస్కారం లభించనుంది.
యూకే ప్రభుత్వం (UK Govt) శుక్రవారం రాత్రి ఈ జాబితాను విడుదల చేసింది. ‘‘అసాధారణ సేవలతో సమాజ స్ఫూర్తిని చాటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సామాన్యులకు ఈసారి సత్కారం లభించింది’’ అని యూకే ఉప ప్రధాని ఒలివర్ డోడెన్ తెలిపారు. అసాధారణ విజయాలు సాధించిన వారు.. సమాజానికి సేవ చేసిన వారికి ఏటా బ్రిటన్ రాజు/రాణి అధికారిక పుట్టినరోజు సందర్భంగా పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మొత్తం 1171 మంది ఈ పురస్కారాలు అందుకోనున్నారు. ఇందులో 40 మందికి పైగా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు.
నిజానికి ఛార్లెస్ 3 అసలు పుట్టిన రోజు నవంబరు 14వ తేదిన. అయితే మోనార్క్ అధికారిక పుట్టినరోజును జూన్ 17న నిర్వహించడం అనాదిగా వస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.00 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 1400 మంది సైనికులు, 400 మంది సంగీత వాయిద్యాకారులు, 200 గుర్రాలతో పరేడ్ నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్