Indonesia: మారనున్న ఇండోనేషియా రాజధాని!

ఇండోనేషియా రాజధాని మారబోతుంది. ప్రస్తుతం ఆ దేశానికి జకర్తా రాజధానిగా ఉండగా.. ఇప్పుడు బోర్నియో ఐలాండ్‌లోని తూర్పు కాలిమాంటన్‌ ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజధాని మార్పు బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు

Published : 19 Jan 2022 01:21 IST

జకర్తా: ఇండోనేషియా రాజధాని మారబోతుంది. ప్రస్తుతం ఆ దేశానికి జకార్తా రాజధానిగా ఉండగా.. ఇప్పుడు బోర్నియో ఐలాండ్‌లోని తూర్పు కాలిమాంటన్‌ ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజధాని మార్పు బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. రాజధానిగా మారబోతున్న తూర్పు కాలిమాంటన్‌ ప్రాంతానికి ‘నుసంతరా’ అని నామకరణం చేశారు. అంటే ఇండోనేషియాలో ‘ద్వీప సమూహం’ అని అర్థమట. ఇది జావా ద్వీపంలోని ప్రస్తుత రాజధాని జకార్తాకు 2వేల కి.మీ దూరంలో ఉంది. నూతన రాజధాని నుంచి పరిపాలన ప్రారంభించినా.. జకార్తా నగరం ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు. 

బోర్నియో.. మూడు దేశాల భూభాగం

ఆగ్నేయాసియాలో ఉన్న అతి పెద్ద ద్వీపాల్లో బోర్నియో ఒకటి. ఈ భూభాగాన్ని ఇండోనేషియా, మాలేషియా, బ్రూనే దేశాలు పంచుకొన్నాయి. ఇండోనేషియాకు చెందిన తూర్పు కాలిమాంటన్‌ భూభాగంలోనే ఇప్పుడు కొత్త రాజధానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతాభివృద్ధి కోసం త్వరలో జాతీయ స్థాయిలో కమిటీ ఏర్పాటు కానుందని, ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని అక్కడి ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. 2024 ప్రథమార్థంలో రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపాయి. పదేళ్ల జాతీయ ప్రాధాన్యమున్న కార్యక్రమంగా దీన్ని చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు